కేసీఆర్ కార్యాలయంపై దాడి యావత్ తెలంగాణ మీద జరిగినట్లే ...
గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం...
ఇదేనా మీ ప్రజా పాలన...?
బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద జరిగిన దాడి యావత్ తెలంగాణ మీద దాడి చేసినట్లు భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి..సీఎం రేవంత్ రెడ్డి గుండాయిజం పరిపాలనను ప్రోత్సహిస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం.. ఇదేనా మీరు ప్రజలకు అందిస్తున్న పాలన అని మేము ప్రశ్నిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో శాంతిభద్రతలు కూడా లోప భూయిష్టంగా మారాయి. గజ్వేల్ కార్యాలయం పై జరిగిన దాడి ఇందుకు నిదర్శనం.
ఇలాంటి అరాచక పరిపాలనను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక వాటిని డైవర్షన్ చేసేందుకు హింస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే సహించబోమని హెచ్చరిస్తున్నామన్నారు.




