20 June, 2026 | 2:30 AM

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

20-06-2026 01:07 AM

జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి 

బోయినపల్లి జూన్ 19 (విజయక్రాంతి): ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసిందని చిన్నారుల తల్లిదండ్రులు మీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని బోయినపల్లి కొదురుపాక, గుండన్న పల్లి, కోరెం గ్రామాలలో నూతనంగా మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూల్ లను జిల్లా విద్యాధికారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వి ద్యార్థులు ఉపాధ్యాయులు జిల్లా విద్యాధికారికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందజేశారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించిన అనంతరం చిన్నారులకు అక్షరా భ్యాసాన్ని నిర్వహించారు.

అలాగే బోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జి ల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రియ ప్రైమర్స్కూలను ఏర్పాటు చేసిందని అన్నారు గత సం వత్సరం 14 స్కూళ్ళను జిల్లాలో మంజూరు చేయగా ఈ సంవత్సరం 48 స్కూళ్లను మంజూరు చేసిందని అన్నారు.

ప్రీ ప్రైమరీ స్కూల్ లలో నాలుగు సంవత్సరాలు నిండి న విద్యార్థులను పాఠశాలకు పంపియాలని తల్లిదండ్రులను కోరారు.ఒక పాఠశాలకు ఒక టీచర్ తో పాటు ఆయాను నియమిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఒక్కో పాఠశాల మీద లక్షన్నర రూపాయల విధులను వెచ్చిస్తుందని ఈ నిధులతో చిన్నారులకు ఫర్నిచర్ తోపాటు ఆట బొమ్మలు,తరగతి గదిని పెయింట్ తో ఆహ్లాదకరంగా తీర్చి దిద్దనున్నట్లు తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని నాలు గు సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థిని ప్రీ ప్రైమరీ స్కూలుకు పంపించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో సర్పంచులు నల్లమోహన్, కొప్పుల లావణ్య, జంపుక మాధవి, కత్తెరపాక మంజుల, వార్డు సభ్యులు చౌదరి శ్రీధర్, అమ్మిగల్ల గోపాల్, నాయకులు మెరుపుల జలంధర్,అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు పిట్టల జలజ,ప్రీ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ లు కనకయ్య,సత్యనారాయణ,కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు భూమయ్య,బొలగం శ్రీనివాస్ లు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.