1 June, 2026 | 9:10 PM

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: ఎమ్మెల్యే పద్మావతి

01-06-2026 08:39 PM

కోదాడ,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యాసంస్థలు కృషి చేయాలని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. సోమవారం కోదాడలోని చిన్నారి విద్యాపీఠ్  ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా చిన్నారి విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు జానకిరామయ్య, కరస్పాండెంట్ హర్షిత్ వర్మ తెలిపారు. ప్రారంభ దశలో 200 మంది విద్యార్థులతో పాఠశాలను ప్రారంభిస్తున్నామని, ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెంపొందించేందుకు మణిపూర్, అస్సాం రాష్ట్రాల నుంచి 50 శాతం మంది ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్లడించారు.