బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలి
01-06-2026 08:37 PM
బోధన్,(విజయక్రాంతి): బోధన్ మండలం బెల్లాల్లో అక్రమ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం ఆరోపించారు. కాలనీల్లో ఎక్కడపడితే అక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. యువత మద్యానికి బానిసలవుతున్నారని మహిళలు భయంతో బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎక్సైజ్ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






