బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు అందించాలి
జిల్లా ప్రోగ్రాం అధికారి డా.ప్రసిద్ధి
నేరేడుచర్ల, జూలై 29 :ప్రసూతి తల్లులకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు, పోషకాహారం మరియు ప్రసవానంతర సంరక్షణను ఎలాంటి లోటు లేకుండా అందించాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డా.ప్రసిద్ధి సంబంధిత సిబ్బందికి సూచించారు.నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించన సందర్భంగా ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు, లేబర్ రూమ్, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.
పీహెచ్సీలో బుధవారం సాధారణ ప్రసవం ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చిన దేవిని ప్రత్యేకంగా పలకరించి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షిత ప్రసవ సేవలు అందిస్తున్న వైద్యురాలు డా. పున్న నాగిని, నర్సింగ్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించారు.నేరేడుచర్ల పీహెచ్సీలో సాధారణ ప్రసవాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో, సి హెచ్ వో సల్వాది, నర్సింగ్ ఆఫీసర్ విజయలక్ష్మి,ఏ ఎన్ ఎం సునీత, ఆశా యశోద, జ్యోతి సిబ్బంది పాల్గొన్నారు.






