తెలంగాణ ఉద్యమంపై ప్రశ్నలేవి?
- ఉద్యమ నేపథ్యం నుంచి రాని ప్రశ్నలు
గ్రూప్ మహాలక్ష్మి, గృహజ్యోతి స్కీంపై ప్రశ్నలు
నిమిషం నిబంధనతో వెనుతిరిగిన అభ్యర్థులు
ఇన్విజిలేటర్ అత్యుత్సాహంతో జగిత్యాలలో గ్రూప్ విద్యార్థుల ఆందోళన
గ్రూప్ ప్రిలిమ్స్‌కు 74 శాతం హాజరు
ప్రశాంతంగా పరీక్ష జరిగిందన్న టీజీపీఎస్సీ
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): గ్రూప్ ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ముగిసింది. మొత్తం 4.03 లక్షల మందికి 3.02 లక్షల (74 శాతం) మంది అభ్యర్థులు హాజరైనట్టు టీజీపీఎస్పీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తం గా గ్రూప్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ప్రశ్నపత్రం ఓ మోస్తరుగా వచ్చినట్టు అభ్యర్థులు తెలిపారు. గట్టిగా ప్రిపేర్ అయిన అభ్యర్థులకు పేపర్ కాస్త ఈజీగా అనిపిస్తే, అటుఇటుగా ప్రిపేర్ అయినవారికి మాత్రం టఫ్‌గానే అనిపించింది. గత పేపర్స్ కంటే కాస్త ఈజీగా, మోడరేట్‌గా ఉన్నట్టు పలువురు అభ్యర్థులు తెలిపారు.
గ్రూప్ ప్రిలిమ్స్‌లో తెలంగాణ ఉద్యమం ఓ సబ్జెక్టుగా ఉంది. కానీ తెలంగా ణ ఉద్యమం నుంచి పెద్దగా ప్రశ్నలు అడగలేదని అభ్యర్థులు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంపై తప్పక ప్రశ్నలు వస్తాయని అభ్యర్థులు ప్రిపేర్ అవుతుంటారు. ఈ టాపిక్ నుంచి వచ్చే ప్రశ్నలకు ఇట్టే ఆన్సర్ చేయొ చ్చు. తెలంగాణ ఉద్యమంపై ప్రశ్నలు లేకుం డా ఏ పరీక్షనూ ఊహించలేం. అలాంటిది గ్రూప్ తొలి, మలిదశ ఉద్యమం, సం స్కృతి నుంచి పెద్దగా ప్రశ్నలు అడగలేదని అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తంచేశారు.
తికమక ప్రశ్నలు
కరెంట్ అఫైర్స్ ఈజీగా ఇచ్చినట్టు పలువురు అభ్యర్థులు తెలిపారు. ఎలక్షన్ కమిష న్‌పై ప్రశ్నలు అడిగారు. ఎక్కువ ప్రశ్నల్లో ఆప్షన్లు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఆన్సర్ చేయడంలో తికమకపడ్డారు. ఎకనామిక్స్ అయితే పూర్తిగా చదివినవారు మాత్ర మే ఆన్సర్ చేయగలరు. సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం టఫ్‌గా ఇచ్చారు. ఇక తెలంగా ణ విషయానికి వస్తే తెలంగాణ చరిత్ర కాస్త కఠినంగా ఇస్తే, ఆరు గ్యారెంటీల నుంచి 2 ప్రశ్నలు ఇచ్చారు. మధ్యంతర బడ్జెట్‌పై ప్రశ్న లు ఈజీగా, మ్యాథ్స్, రీజనింగ్ ఓ మోస్తరుగా ఇచ్చినట్టు అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తంచేశారు.
నిమిషం నిబంధనతో వెనక్కి
నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. పలుచోట్ల చివరి నిమిషం దాటాక అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. కానీ 10 గంటలకు ఒక్క నిమి షం లేటయినా అధికారులు వారిని అనుమతించలేదు. సిద్దిపేట డిగ్రీ కాలేజీ సెంటర్ వద్దకు నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యం గా వచ్చిన దాదాపు పది మంది అభ్యర్థుల ను అధికారులు అనుమతించలేదని తెలిసింది. జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్టీ యూ కేంద్రం వద్ద రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఐదుగురు అభ్యర్థులను అక్కడి సిబ్బంది అనుమతించలేదు.
దీంతో వీరంతా పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. మంచిర్యాలలో ఓ సెంటర్ వద్ద పది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థిని సెంటర్‌లోకి అనుమతించకపోవడంతో అత డు హాల్‌టికెట్‌ను చింపేసి నిరాశతో వెనుదిరిగారు. తాండూర్‌కు చెందిన ఓ దివ్యాం గురాలు అక్కడ వీల్ చైర్ లేకపోవడంతో నేలపై పాకుతూ సెంటర్‌లోకి వెళ్లింది. మరికొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చినవారిని అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు.






