ఫ్యూచర్ సిటీకి పరుగులు
- శరవేగంగా రావిర్యాల - ఆమనగల్ రేడియల్ రోడ్డు పనులు
- డిసెంబర్‌లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌లోపు పనులు పూర్తి అయ్యేలా అధికారుల ప్రణాళికలు
- త్వరలో 81 కి.మీ. బుద్వేల్ - కొడంగల్ ప్రాజెక్టు పనులు
రంగారెడ్డి, ఆగస్టు17 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ’ఫ్యూచర్ సిటీ’కి కనెక్టివిటీ పెంచేలా హెచ్‌ఎమ్డీఏ రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా ఆమనగల్ (ట్రిపుల్ ఆర్) వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్డు మొదటి దశ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఫ్యూచర్ సిటీలో డిసెంబర్లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కన్నా ముందే పనులు పూర్తి అయ్యేలా అధికారులు టా ర్గెట్ పెట్టుకున్నారు. ఇటీవలనే హెచ్‌ఎమ్డీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ నానక్రామ్గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటె డ్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
గ్లోబల్ సమ్మిట్ లక్ష్యంగా మొదటి దశ నిర్మాణం
డిసెంబర్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ’గ్లోబల్ సమ్మిట్’ను దృ ష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చే యాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు 41.5 కిలో మీటర్ల మేర 6 లేన్ల గ్రీన్ఫీల్ ఎక్స్ప్రెస్ వేను చేపడుతున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా దీనిని 8 లేన్లుగా విస్తరించేలా రూపకల్పన చేశారు. తొలిదశ...రావిర్యాల - మీర్ఖాన్పేట్ 19.2 కి.మీ. పొడవు గల ఈ మార్గాన్ని రూ. 1,282.30 కోట్లతో నిర్మిస్తున్నారు.
రెండో దశ....మీర్ఖాన్పేట్ - ఆమనగల్ వరకు 22.3 కి.మీ. పొడవు ఉండే ఈ భాగానికి అంచనా వ్యయం రూ. రూ.1,538.31 కోట్లు పనుల కోసం భూసేకరణ దాదాపు పూర్తయినప్పటికీ, అక్కడక్కడా ఉన్న చిన్నపాటి అడ్డంకులను రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.రెండవ దశ ను సైతం అధికారులు సన్నాహాకాలు సైతం మొదలుపెట్టారు. రాజేంద్ర నియోజకవర్గం బుద్వేల్ - కొడంగల్ మార్గానికి డీపీఆర్ సిద్ధంచేసినట్లు అధికారులు తెలిపారు.ఓఆర్‌ఆర్ బుద్వేల్ ఎగ్జిట్ నుంచి కొడంగల్ వరకు నిర్మించనున్న 81 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు-2 ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమైందని హెచ్జిసిఎల్ అధికారులు తెలిపారు. ఈ పనులకు సంబంధించి త్వరలోనే ఆన్లైన్ బిడ్డింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వివరించా రు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే ఫ్యూచర్ సిటీతో పాటు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో రవాణా వ్యవస్థ మెరుగుపడి, పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కానుంది ప్రభుత్వం భావిస్తుంది.






