నేడు ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ
23 ఏళ్ల కళ నెరవేరుతున్న చరిత్రాత్మక ఘట్టం: ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్
ముషీరాబాద్,ఆగస్టు 17(విజయక్రాంతి): అణగారిన వర్గాలకు రాజ్యాధికారం, సామాజిక న్యాయం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆగస్టు 18న సాయంత్రం 4 గంటలకు హైదరా బాద్ ట్యాంక్‌బండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 23 ఏళ్లుగా ట్యాంక్బ్ంప పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు కోసం ఉద్యమం కొనసాగించామని గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ సోమవారం ఇక్కడ ఆయన మీడియాకు తెలిపారు.
2003 జూన్ 25న బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఈ అంశంపై తొలి బహిరంగ సభ నిర్వహించినట్లు పేర్కొన్నారు.భువనగిరి కోటపై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో పంజాల జైహింద్ గౌడ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. 2023 ఆగస్టు18న భువనగిరి కోటపై విగ్రహావిష్కరణ ఘనంగా జరిగిందన్నారు.
పాపన్న గౌడ్ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పలువురు గౌడ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేశారని విజయ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తదితరుల పాత్రను ఆయన ప్రస్తావించారు. ట్యాంక్బ్ంప పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ తన 23 ఏళ్ల కల నెరవేరుతున్న చారిత్రాత్మక ఘట్టమని విజయ్ కుమార్ గౌడ్ అన్నారు.






