2 March, 2026 | 10:27 AM

రేడియో నేస్తం

23-09-2024 12:00 AM

ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా టీవీ, మొబైల్, ఇంటర్నెట్, న్యూస్ పేపర్లు.. ఇలా బోలెడు మార్గాలున్నాయి. ఏదైనా సమాచారం చిటికెలో మనకు అందుబాటులో ఉంటుంది. కానీ పూర్వకాలంలో ఏదైనా విషయం తెలియాలంటే రేడియోలే ఆధారం.  ఆ కాలంలో రేడియోలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఆ తర్వాత నిజాం కాలంలో రేడియోలు సంపన్న కుటుంబాల వద్దనే ఉండేవి. సినిమాలు, రాజకీయాలు, ఆటలు.. ఎలాంటి వార్తల కోసమైనా.. రేడియో ద్వారానే వినేవారే. అందుకే అప్పట్లో ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. రేడియో కలిగి ఉండటం గొప్పగా భావించేవారు కూడా. పొలం పనులు.. ఇతర ప్రయాణాల్లో రేడియోలోని పాటలు వింటూ మైమరిచిపోయేవారు. ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ... భలే మంచిరోజు పసందైన రోజు లాంటి పాటలు అలసిపోయిన మనసులకు స్వాంతన చేకూర్చేవి.