2 March, 2026 | 8:46 AM

చరిత్రలో ఈరోజు

23-09-2024 12:00 AM

నటి అత్తిలి లక్ష్మి వర్ధంతి

అత్తిలి లక్ష్మి తెలుగు చలనచిత్ర నటి. ఈమె అనేక సినిమాల్లో నటించారు. జగన్మోహిని (1978) దశ తిరిగింది. ఏడంతస్తుల మేడ (1980), పిల్లజమిందారు (1980) సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. అద్భుత నటనతో తెలుగు తెరపై ముద్ర వేశారు. ఇవాళ ఆమె వర్థంతి.

స్థానం నరసింహారావు జయంతి 

ఈయన రంగస్థల నటుడు. ప్రతి పాత్రలోను తనదైన ప్రత్యేకతను చూపించి 30ఏళ్లపాటు లక్షలాదిమంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ప్రతిభ ఆయనది. నటకావతంస, నటశేఖర, నాటకకళా ప్రపూర్ణ, పద్మశ్రీ వంటి బిరుదులు, పుర స్కారాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. నాటకరంగానికే జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడాయన. ఈ రోజు ఆయన జయంతి. 

అంబటి రాయుడు పుట్టిన రోజు

1985, సెప్టెంబర్ 23న సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. 2001-02లో రంజీ ట్రోఫిలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2002-03 సీజన్‌లో రాయుడు ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఒకే మ్యాలో డబుల్ సెంచరీ, సెంచరీ పూర్తిచేశాడు. ఆ తర్వాత తన ప్రతిభతో భారతజట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఐపీఎల్‌లో 204 మ్యాచులు ఆడి 4348 పరుగులు చేశాడు. 23సార్లు 50పైన స్కోర్లు సాధించాడు. ముంబయి తరఫున మూడుసార్లు (2013, 15, 17) చెన్ను తరఫున మూడుసార్లు (2018, 2021, 2023) ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2023 నుంచి పూర్తిగా ఆటకు గుడ్ బై చెప్పాడు.