2 March, 2026 | 12:15 PM

మరుపురాని మరచెంబు!

23-09-2024 12:00 AM

పాతతరం వస్తువులే ఎప్పుడూ కళాత్మమే.. గుండుసూది నుంచి ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉండేది. అలాంటి వాటిలో మరచెంబు ఒకటి. ఇది బిగించే మూత ఉన్న నీటిని నిలువచేసుకునే ఒక చెంబులాంటి పాత్ర. మరచెంబు గురించి ఈతరంవాళ్లకు మచ్చుకైనా గుర్తుకురాదు. కానీ మన తాతల కాలంలో ఎక్కువగా వాడేవారు. పాత రోజుల్లో ప్రయాణాల్లో దాహం తీర్చుకోవటానికి మరచెంబును  తీసుకువెళ్ళేవారు. అంతేకాదు.. పెళ్ళి సంబరాల్లోని అల్లుడి అలకబూనిన సమయంలో, విహారయాత్రల్లో బాగా ఉపయోగపడేది. అయితే కాలం మారడం.. మనుషుల ఆలోచనలు మారడంతో పాత వస్తువులకు కాలం చెల్లి మరచెంబు కనుమరుగైంది. కానీ మరచెంబుల స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే అని అంటారు మనపెద్దవాళ్లు. ఇప్పటి ప్లాస్టిక్, స్టీల్ పాత్రలకంటే మరచెంబు బెటర్ అని అంటుంటారు.