6 June, 2026 | 8:24 PM

Breaking News

అధ్యాపకులు మనసుపెట్టి భోదించాలి: ఎన్ఆర్ఐ గోపాల్ టీకే కృష్ణ   •   పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ అభివృద్ధి పనులకు శ్రీకారం   •   అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   రైతుల వడ్లు రక్షించిన పోలీసులు   •   మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో రెండో రోజు ప్రత్యేక వార్డుల సభ   •   ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ అభ్యర్ధులకు సర్టిఫికెట్లు అందజేసిన జివి కిరణ్ కుమార్   •   దమ్మపేట పంచాయతీలో గ్రామసభ   •   టేకులపల్లిలో విత్తన దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి   •   రోడ్డు ప్రమాదంలో 30 గొర్రెల మృతి   •  

రైతులను రాజులుగా చేయడమే కాంగ్రెస్ ధ్యేయం

11-04-2026 12:44 AM

మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి

తుంగతుర్తి, ఏప్రిల్ 10: రైతులను రాజులుగా చేయడమే  కాంగ్రెస్ పార్టీ దేయమని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు శుక్రవారం మద్దిరాల మండల కేంద్రంలోని ఎమ్మెస్ 1, ఎంఎస్ 2 మహిళా సంఘం ఆధ్వర్యంలో, ముకుందాపురం, జి కొత్తపల్లి, చందుపట్ల గ్రామాల్లో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అదేవిధంగా రైతులకు రుణమాఫీ రైతు భరోసా సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ ఇది రైతు ప్రభుత్వం అని రైతులు వరి ధాన్యమును 17 శాతం వచ్చే విధంగా కల్లాల వద్దనే ఆరబెట్టుకుని ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2369 మద్దతు ధర పొందాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కాల అవిల మల్లు యాదవ్, పచ్చిపాల సుమతి వెంకన్న యాదవ్, తాళ్లపెళ్లి సురేష్ గౌడ్, బొబ్బిలి వెంకన్న, ఏవో అనీషా రుహి, ఏపీఎం శ్రీనివాస్, సీసీ సుధాకర్, గ్రామ సర్పంచులు రాంపక నాగరాజు, మీసాల సాగరిక భాస్కర్ రావు, కర్ణాకర్, వాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కొమ్ము వెంకన్న, కొమ్మ అంజయ్య మహిళా సంఘం సభ్యురాలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.