9 June, 2026 | 3:23 AM

రాఘవలారెన్స్ 25వ సినిమా షురూ

15-09-2024 12:00 AM

రాఘవ లారెన్స్ కథనాయకుడిగా రమేష్‌వర్మ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనున్న నూతన చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ.. రమేష్‌వర్మతో తమ సంస్థలో ఇంతకుముందు తెరకెక్కించిన రాక్షసుడు, సినిమాలు మంచి ప్రజాధరణ పొందయని, ఈ సారి బిగ్ యాక్షన్ అడ్వంచరస్‌తో అత్యంత భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టమన్నారు.

నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 సమ్మర్‌లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. కొరియోగ్రాఫర్‌గా అత్యున్నత ప్రతిభ కనబరిచి హీరోగా మెప్పిస్తున్న రాఘవ లారెన్స్ కెరీర్‌లో ఇది 25వ సినిమా. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు మేకర్స్ తెలిపారు.