ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన రాగిడి లక్ష్మారెడ్డి
ఘట్ కేసర్, జూలై 5 (విజయక్రాంతి) : ఘట్కేసర్ సర్కిల్, 6వ డివిజన్ లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ బిఆర్‌ఎస్ పార్టీ బిఎల్‌ఎ ల సమావేశానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ నియోజకవర్గం పరిశీలకులు రాగిడి లక్ష్మారెడ్డి విచ్చేశారు. ఈ సమావేశంలో బిఎల్‌ఎ లకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మైసమ్మగుట్ట కాలనీలో ప్రజలకు ఓటర్ ఎన్మరేషన్ ఫారం ఇచ్చి ఏ విధంగా నమోదు చేయాలో తగిన సూచనలు ఇచ్చారు.
ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి, పిర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి, కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్, కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి, బేతాళ నర్సింగ్ రావు, బండారి ఆంజనేయులు గౌడ్, జనగామ యాదగిరిరావు, పందిరి శశికల, ఎంపాల సుధాకర్ రెడ్డి, అన్నుభాయ్, బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, కుతుబ్, వరికుప్పల లింగస్వామి, బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన బిఎల్‌ఎ లు ముఖ్య నాయకులు, పాల్గొన్నారు.






