దేశవ్యతిరేకంగా రాహుల్‌గాంధీ వ్యవహారం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణ
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఆపరేషన్ సిందూర్ విజయాన్ని దేశమంతా సంబురంగా జరుపుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాత్రం పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని పునరావృతం చేస్తూ భారత సైనికులను నైరా శ్యానికి గురిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ, కాం గ్రెస్ పార్టీ పాకిస్థాన్ ప్రస్తావనలు కొనసాగి స్తూ, భారతదేశ సైనికుల విజయాన్ని కించపరుస్తున్నారని సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. దేశానికి వ్యతిరేకంగా ఆయ న వ్యవహారం ఉందన్నారు.
దేశం మొత్తం మన సైనికుల విజయాన్ని గర్వంగా జరుపుకుంటున్న సమయంలో, రాహుల్ గాంధీ మాత్రం పా కిస్థాన్ ఆరోపణల ను ప్రోత్సహిస్తూ, ప్రజల్లో అనుమానాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. ప్రధా న మంత్రి నరేంద్ర మోదీ బలమైన నిర్ణయా ల ఫలితంగా పాకిస్థాన్ మోకరిల్లే పరిస్థితి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలను పక్కన పెట్టి, దేశ ప్రయోజనాల కోసం నిలుస్తారా అని అనుమానం వ్యక్తంచేశారు. దేశభక్తికి కట్టుబడి ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారిందని దుయ్యబట్టారు.






