calender_icon.png 20 May, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు గడ్డపై ఉగ్రమూలాలు.. విస్తుపోయే నిజాలు

20-05-2025 02:46:58 AM

  1. రంగంలోకి దిగి విచారిస్తున్న ఎన్‌ఐఏ
  2. ఇన్‌స్టాలో ప్రత్యేకంగా గ్రూపు

హైదరాబాద్, మే 19: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రమూలాలు కలకలం సృష్టించాయి. ఇప్పటికే ఈ విషయంలో పోలీసులు సిరాజ్ ఉర్ రెహ్మాన్ (29), సయ్యద్ సమీర్(28) అనే ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వీరిలో సిరాజ్‌ది ఏపీలోని విజయనగరం కాగా, సమీర్‌ది తెలంగాణ. విజయనగరంలోని సిరాజ్ ఇంటిలో తనిఖీలు చేసిన పోలీసులకు పేలుడు పదార్థాలు లభించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ అనే వ్యక్తికి కూడా దీంతో సంబంధాలున్నాయని సిరాజ్ తెలిపాడు.

దీంతో అతడిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పోలీసులతో పాటు జాతీయ భద్రతా అధికారుల (ఎన్‌ఐఏ) విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. గడిచిన ఆరునెలల్లో సిరాజ్ మూ డు సార్లు సౌదీకి వెళ్లాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతే కాకుండా ఈ ఇద్దరూ కలిసి అల్‌హింద్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ సం స్థను కూడా స్థాపించినట్టు వెల్లడైంది. సిరాజ్ అరెస్ట్ సమయంలో అతడి వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభించాయి.

ఈ ఇద్దరు విజయనగరంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నారు. సౌదీ అరేబియా నుంచి ఐసీసీ మాడ్యుల్ ద్వారా ఈ ఇద్దరికి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు మాత్రమే కాకుండా మరో నలుగురికి కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని తేలింది. ఈ నలుగురు సౌదీలోని ఉగ్రవాద హ్యాండిలర్స్‌తో మాట్లాడేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ గ్రూపును కూడా ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. 

సికింద్రాబాద్‌లో సమీర్.. టిఫిన్ బాక్స్ బాంబుల తయారీకి ప్లాన్?

ఉగ్రమూలాల కేసులో అరెస్టయిన సమీర్ సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కళారంగ్ కాల నీలో నివాసం ఉంటున్నాడు. లిఫ్ట్ మెకానిక్‌గా విధులు నిర్వర్తిస్తూ తన తల్లి, సోదరితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సమీర్ అమెజాన్‌లో స్టీల్ టిఫిన్ బాక్సులను ఆర్డర్ చేసినట్టు సమాచారం. గతంలో రంపచోడవరం అటవీ ప్రాం తంలో వీరు బాంబుల పనితీరుపై రిహార్సల్స్  చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం దేశభద్రత కు సంబంధించినది కావడంతో దర్యాప్తు అం శాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.