18 April, 2026 | 3:56 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

19-06-2025 05:05 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని స్థానిక విశ్రాంతి భవనంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం కాంగ్రెస్ నాయకులు మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేసింది గాంధీ కుటుంబం అని కొనియాడారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల శ్రేయస్సు కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాహుల్ గాంధీ కాశీ నుండి కన్యాకుమారి భారత్ జోడో యాత్ర నిర్వహించిన నాయకుడు అని అన్నారు.

రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆశ భావం వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో భారత దేశ ప్రధాని రాహుల్ గాంధీ అని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మాజీ ఎంపిటీసీ వెంకట్ స్వామి గౌడ్, గుత్తికొండ శ్రీధర్, నవాబ్, అమీర్, హాజీ, రాజు, రవీందర్, గొపతి రమేష్, బుద్దె దేవా, రాకేష్, లచ్చన్న, కిషన్, కాంగ్రెస్ నాయకులు, వార్డ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.