19-06-2025 05:09:08 PM
మందమర్రి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ(Congress Party National Leader Rahul Gandhi) జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గురువారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తుని మార్చబోయే నాయకుడు, రాబోయే కాలంలో కాబోయే ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల్ రెడ్డి, తుంగపిండి విజయ్, వీరన్న, మైనారిటీ నాయకులు ఎండి ఇషాక్, కొక్కుల మధు యూత్ కాంగ్రెస్ నాయకులు ఒజ్జ గణేష్, మహేష్, చోటు, రాజేష్, కిరణ్ సతీష్, చింటూ, పృథ్వీ, సంపత్ లు పాల్గొన్నారు.