18 April, 2026 | 12:28 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు

20-06-2025 12:02 AM

కేక్ కట్ చేసిన మంత్రి అడ్లూరి, వీహెచ్, మెట్టుసాయి 

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. ఫిషర్‌మెన్ కార్పొరే షన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఆధ్వర్యం లో చేపట్టిన జన్మదినవేడుకల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్,  ఎమ్మెల్సీ ఆమీర్‌అలీఖాన్, పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు  పాల్గొన్నారు.

మెట్టుసాయి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు వీహెచ్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఎంపీ అనిల్‌కుమార్ నేతృత్వంలో గాంధీభవన్‌లో రాహుల్‌గాంధీ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. దేశ ప్రజల కోసం రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడోయాత్ర చేపట్టారన్నారు. 

జ్యోతిబాఫూలే చిత్ర వీక్షణ

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి నేతృత్వంలో పంజాగుట్టలోని పీవీఆ ర్ మాల్‌లో ప్రదర్శించిన ‘జ్యోతిభాఫూలే’ చిత్రాన్ని కాంగ్రెస్ నేతలు వీహెచ్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ అమీర్‌అలీఖాన్ వీక్షించారు. సామాజిక అసమానత లు, వివక్ష, మహిళలపై అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఫూలే దంపతులకు భారత రత్న ఇవ్వాలని వీహెచ్ కోరారు.