ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్న రాహుల్ రాజ్
మెదక్, మార్చి 1(విజయ క్రాంతి) : రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమీషనర్ రాహుల్ రాజ్ ఏడుపాయల వన దుర్గ భవాని మాత అమ్మవారినీ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం ఎంతో చారిత్రాత్మక ఆలయంగా ప్రసిద్ధికెక్కిందని, భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారని భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం గా విరాజిల్లుతుందని మహిమాన్విత వన దుర్గ భవాని అమ్మవారి ఆశీస్సులతో జిల్లాలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కమిషనర్ ఆకాంక్షించారు.




