2 March, 2026 | 1:54 AM

ముగిసిన ఎల్‌ఎస్‌జీ ప్రీమియర్ లీగ్

02-03-2026 12:09 AM

బహుమతులు అందజేసిన వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్ 

జిన్నారం/ అమీన్ పూర్, మార్చి 1 : గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎల్‌ఎస్ జి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహంగా ముగిసింది. ఫైనల్ పోరులో అద్భుత ప్రతిభ కనబర్చిన ఎల్‌ఎస్జీ యువసేన జట్టు విజేతగా నిలిచింది. ప్రథమ బహుమతి ఎల్‌ఎస్జీ యువసేనకు రూ.15,000, ద్వితీయ బహుమతి మాదారం-2 రూ.10,000లను గెలుపొందారు.

గడ్డపోతారం వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణను, ఐక్యతను పెంపొందిస్తాయని, కేవలం శారిరక ఆరోగ్యం కోసమే కాకుండా, సభ్యుల మధ్య ఐక్యమత్యం, మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు ఇలాంటి క్రీడలు దోహదపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నవీన్, మల్లేష్ ముదిరాజ్, ఠాకూర్ స్వాతి గణేష్ సింగ్, గ్రామ ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు.