ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము ఇంట్లో సోదాలు
కరీంనగర్, జూన్ 25 (విజయక్రాంతి): గతంలో లంచం తీసుకుంటూ అరెస్టయిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ ఇన్‌స్పెక్టర్ గుండెటి రాముపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు కూడా నమోదు చేశారు. రాము జగిత్యాలలో అద్దెకు ఉంటున్న ఇంట్లో సోదాలు జరపగా రూ. 20,67,850 నగదు లభ్యం కాగా, ఆయనకు చెందిన ఎస్ బి ఐ ఖాతాలో రూ. 29,88,317 , ఆయన తండ్రి శంకర్ యూ బి ఐఖాతాలో రూ. 16,77,978, రూ. 11,97,000 విలువైన వస్తువులు, కరీంనగర్ లో రూ. 6,05,000 విలువైన ఒక ఖాళీ స్థలం, సిరిసిల్లలో రూ. 2,18,484 విలువైన వాణిజ్య భూమి, మొత్తం రూ. 87,44,629 విలువైన ఆస్తులు, నగదును గుర్తించారు.
స్థిరాస్థుల విలువ బహిరంగ మార్కెట్ లో అంతకన్న ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్చి 17న గుండేటి రాము ఓ బెల్లం వ్యాపారి నుంచి తన స్నేహితుడైన ప్రభుత్వ టీటర్ ఖాతాలకు యూపిఐ ద్వారా లంచం నగదు బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు అతనితో పాటు ఒబులాపూర్ లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న జక్కని వేణులపై కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు.






