ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపులపై దళిత నిరుద్యోగుల దీక్షలు
కల్వకుర్తి, జూన్ 25: కల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపులు చట్ట విరుద్ధంగా జరిగాయని అందుకు నీరసంగా దళిత నిరుద్యోగులు గురువారం దీక్షలు చేపట్టారు. నిరుపేద దళిత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నిర్మించిన కాంప్లెక్స్లో నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు దుకాణాలు , కేటాయించాలని ఆరోపించారు. నిజంగా ఉపాధి అవసరమైన అర్హులైన నిరుద్యోగ దళితులకు అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు.
రాజకీయ ప్రభావం, అధికారుల పక్షపాత వైఖరి ఉందని ఆరోపిస్తూ బాధితులు ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని కేటాయింపుల ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా కేటాయించిన షాపులను రద్దు చేసి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని దళిత నిరుద్యోగులు హెచ్చరించారు.






