calender_icon.png 19 July, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ... వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ: మంత్రి అశ్విని వైష్ణవ్

19-07-2025 04:43:21 PM

కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీని పరిశీలించిన రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైలు మౌలిక సదుపాయాలను మార్చే ప్రధాన 'మేక్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్ అయిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RMU) పురోగతిని సమీక్షించడానికి  కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం సందర్శించారు.  రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించి, శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ నుండి కాజీపేటకు రైలులో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో వెళ్లారు. ఈ ప్రయాణంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చించి, నిర్మాణ పనుల పురోగతిని కేంద్ర మంత్రులకు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికైన ప్రతినిధులు, ఎస్సీఆర్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సంరద్భంగా మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ... కాజీపేట రైల్వేకోచ్ పరిశ్రమ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని అన్నారు. వరంగల్ ప్రజల కోరికను ప్రధాని మోదీ నెరవేర్చారని, కాజీపేటలో మెగా రైల్వేకోచ్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని, ఫ్యాక్టరీ పనులు వేగంగా సాగుతున్నాయని ఆయన కొనియాడారు. 2026లో కాజీపేటలో రైల్వేకోచ్ ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, కాజీపేట నుంచే లోకోమోటివ్ లు కూడా ఎగుమతి అవుతాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకోమోటివ్ లు ఎగుమతి అవుతాయని, ఈ కోచ్ ఫ్యాక్టరీలోనే మెట్రో కోచ్ లు కూడా తయారవుతాయని చెప్పారు.