14 April, 2026 | 1:56 AM

క్షేమంగా ఇంటికి వెళ్లండి

14-04-2026 12:17 AM
  1. మీ కోసం మీ కుటుంబం ఎదురుచూస్తుంది

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ 

కాజీపేట, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): వాహనదారులు ట్రాఫిక్ నిబందనలు పాటిస్తూ క్షేమంగా ఇంటి రావాలని.. మీ రాక కోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రజల్లో రోడ్డు భద్రతతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకుగా సోమవారం నుండి ఈ నెల 18 తేది వరకు చేపట్టిన ఆరైవ్‌ౠఆలైవ్ కార్యక్రమములో భాగంగా ఎల్కతుర్తి మండలం చింతల్ పల్లి గ్రామంలో ఎల్కతుర్తి పోలీసుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధి పాల్గోన్నారు.

ఈ సందర్బంగా చింతల్ పల్లి గ్రామంలో ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించే విధంగా వాహనదారులకు అవగాహన కల్పించి రీతిలో ఎర్పాటు చేసిన బైక్ ర్యాలీ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, డీసీపీ ధార కవిత, స్థానిక పోలీస్ అధికారులు గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారులతో బైక్ ర్యాలీలో పాల్గోని గ్రామస్తులను ఉత్తేజపరిచారు.

అనంతరం గ్రామ పంచాయితీ కార్యాలయము అవరణలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీపీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపటంతో పాటు, సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రయాణించడం ప్రమాదకరమని, ద్విచక్ర వాహనదారుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, హెల్మెట్ ధరించి వాహనం నడపటం ద్వారా ప్రమాదాలకు గురైనప్పుడు ప్రాణాపాయం నుండి హెల్మెట్తో రక్షించబడుతారని, అలాగే యువత అతివేగంగా వాహనాలను నడిపి మృత్యువాత పడవద్దని, రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని,

ఈ రోడ్డు ప్రమాదాలు ఎంతో మంది తల్లిదండ్రులకు కన్నీళ్ళకు కారణమవుతున్నాయని, ప్రతి వాహనదారుడు జాగ్రత్తగా వాహనంగా నడపటంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగివుండటంతో పాటు వాటిని అచరించాలని కోరారు.అనంతం చింతల్ పల్లి గ్రామంలోని వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించి రావలని లేదంటే గ్రామంలో ప్రవేశం లేదని గ్రామ సభలో తీర్మానం చేసారు.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా గ్రామస్తులకు హెల్మెట్లను పంపిణీలు చేసారు. ఈ కార్యక్రమములో కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సీ ఐ పులి రమేష్, కాజీపేట్, హసన్పర్తి ఇన్స్సె్పక్టర్లు సుధాకర్ రెడ్డి, చేరాలు, ఎల్కతుర్తి, ముల్కనూర్ ఎస్.ఐలు ప్రవీణ్ కుమార్, రాజు, గ్రామ  సర్పంచ్ రజితా రవీందర్, మార్కెట్ చైర్మన్ సంతాజీతో ఇతర పోలీస్ అధికారులు, గ్రామస్తులు పాల్గోన్నారు.