16 April, 2026 | 8:35 AM

రాబోయే 5 రోజులు వానలే

13-05-2025 12:00 AM

తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తా యని వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామా బాద్, కరీంనగర్, మెదక్, భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూ బ్‌నగర్ జిల్లాల్లో పలు చోట్ల గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

బుధవారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహ బూబ్‌నగర్ జిల్లాలలోని పలు ప్రాంతాల్లో 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయడంతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు రాబోయే 5 రోజులకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.