calender_icon.png 13 May, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మితిమీరుతున్న కట్టడాలు

13-05-2025 12:00:00 AM

  1. చర్యలపై అధికారుల ఉదాసీనత 
  2. చట్టాలున్న అమలు శూన్యం 
  3. పట్టణ ప్రాణాలిక అధికారుల తీరుపై ఆరోపణలు 

భద్రాద్రి కొత్తగూడెం మే 12 (విజయ క్రాంతి): పిల్లి గుడ్డిదైతే... ఎలుక ఎక్కిరించిన చందాన ఉంది పాల్వంచ మున్సిపాలిటీ అధికారుల తీరు. రెండవ గ్రేడ్ మున్సిపాలిటీ గా ఉన్న పాల్వంచలో మితిమీరిన అక్రమ కట్టడాలు ఆక్రమణలు చోటు చేసుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నా యి.

గత మూడు నెలలుగా అనేక అక్రమాలను విజయ క్రాంతి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వరుస కథనాలు ప్రచురించిన చర్యలకు పోనుకోకపోవడంపై లోగోట్టు పెరుమా ళ్ళకు ఎరుక అన్నట్టు ఉంది అధికారుల తీరు.  నూతన పురపాలక చట్టం అధికారులకు అనే క అధికారాలు కల్పించిన పాల్వంచ మున్సిపాలిటీలో అక్రమాలపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఏమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నా రు.

అందిన కాడికి పుచ్చుకో కదలకుండా కూర్చో అన్నట్లుగా అధికారులు వ్యవహ రిస్తున్నారని ఆరోపణలు వెలబడుతున్నా యి. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు, పొందిన అనుమతులను అతిక్ర మించడం, అసంపూర్తి ఎల్లకు ఇంటి నెంబర్లు కేటాయించటం, మున్సిపాలిటీ స్థలాలను బేషరతుగా ఆక్రమించుకోవడం వంటి అనేక అక్రమాలు పట్టణంలో చోటు చేసుకుంటున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెలువడుతున్న ఆరోపణలను ధృ పరుస్తున్నాయి.

వెలుగు చూసిన అక్రమాలు 

పంచాయతీ స్థలంలో తప్పుడు దృవీకరణ పత్రాలతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చే యడమే కాకుండా మున్సిపాలిటీలో ఇంటి నెంబర్లు కేటాయించడం. స్వయంగా తాసిల్దార్ ఫంక్షన్ హాల్ నిర్మాణం పంచాయతీ స్థ లంలో ఉందని కోర్టులో నివేదిక సమర్పించి న చర్యలు శూన్యం.--కిన్నెరసాని రోడ్డులో అ సంపూర్తి ఇంటికి ఇంటి నెంబర్ కేటాయించడం.

అల్లూరి సెంటర్లో 60 గజాల స్థలము లో ఎలాంటి అనుమతులు లేకుండా జి +3 భవన నిర్మాణం. మున్సిపాలిటీకి కూత వేటు దూరంలో పెద్ద డ్రైనేజీని ఆక్రమించి షెడ్డు ని ర్మాణం చేయడం. చాకలి బజారులో జి+2 అనుమతులు పొంది, g+3 నిర్మాణం చేయడమే కాకుండా 15 గజాల మున్సిపాలిటీ స్థ లాన్ని దర్జాగా ఆక్రమించి నిర్మాణం చేయ డం.

ఒడ్డుగూడెం లో ఎప్పుడో కట్టిన పాత ఇంటికి కొత్తగా అనుమతులు ఇచ్చి నిర్మాణానికి సహకరించడం ఇవి కేవలం కొన్ని వె లుగు చూసిన మచ్చుతునకలు మాత్రమే. బయటకు రాకుండా భూస్థాపితం అవుతున్న అక్రమాలు చెప్పలేనన్ని ఉన్నాయని తెలుస్తోంది.

ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమా, ఆమ్యామ్యాల ప్రభావమా అంటూ పట్టణంలో చర్చించుకుంటున్నారు. ఏ విషయమై పట్టణ ప్రణాళిక అధికారి నవీన్ కుమార్ను వివరణ కోరగా సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. మున్సిపల్ కమిషనర్ లో వివరణ కోరాలని చెప్పడం కోసమేరుపు.