calender_icon.png 18 July, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో వర్షం

18-07-2025 01:15:25 AM

-పలు ప్రాంతాలు జలమయం

-ఉప్పల్‌లో రికార్డు స్థాయిలో 9 సెం.మీ. వర్షపాతం

హైదరాబాద్, సిటీ బ్యూరో జూలై 17(విజయక్రాంతి): హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో రోడ్లపై భారీగా వరదనీరు నిలిచి.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సాయంత్రం వర్షం కురవడం వల్ల పాఠశాలలు, కళాశాలల నుంచి ఇళ్లకు చేరుకుం టున్న విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఉప్పల్‌లో రికార్డు స్థాయిలో 8.53 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఫిలింనగర్, మణికొండ, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, నిజాంపేట్, శేరిలింగం పల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, హకీంపేట్ వంటి ప్రాంతాలతో పాటు నగర శివారుల్లోనూ వర్షం దంచికొట్టింది. ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ప్రగతినగర్, వివేకానందనగర్, మియాపూర్, మూసాపేట, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసిన వర్షంతో కాలనీల్లోకి వర్షపునీరు చేరింది.

సహాయక చర్యల్లో జీహెచ్‌ఎంసీ, హైడ్రా బృందాలు

రోడ్లపై నీరు నిలిచిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రా అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తమై వరద నివా రణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. వరద నీటి ని సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్య లు చేపట్టారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ, ట్రా ఫిక్, ఫైర్ విభాగాలకు చెందిన కంట్రోల్ రూ మ్‌లతో కలిసి హైడ్రా బృందాలు పనిచేస్తూ అవసరమైన చోట సేవలు అందించారు. 

రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాతం (సెం.మీలలో) ఉప్పల్: 8.53, నాచారం: 7.83, మారేడ్‌పల్లి: 6.88, మియాపూర్: 5.83, కాప్రా: 5.38, సీతాఫల్‌మండి: 4.83, ముషీరాబాద్: 4.45, మల్కాజిగిరి: 4.35