calender_icon.png 18 July, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరెడ్‌మెట్‌లో వ్యక్తి అదృశ్యం

18-07-2025 01:16:47 AM

మల్కాజిగిరి, జులై 17 : నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాం నగర్, నాగార్జున అపార్ట్‌మెంట్‌లో నివసించే శాలిని బేగం భర్త సలీమ్ ఖాన్ (38) జూన్ 30వ తేదీన ఉదయం ఏడు గంటలకు ఆటో సవారీ కోసం ఇంటి నుండి బయటకు వెళ్లి ఈ రోజు వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

గతంలో కూడా ఇంటి నుండి వెళ్లిన రెండు, మూడు రోజులకి మళ్ళీ తిరిగి వచ్చేవాడు కానీ, నా భర్త ఈ మధ్యకాలంలో బాగా అప్పులు చేసి ఆ అప్పులను కట్టలేక ఇంటి నుండి వెళ్లిపోయాడేమో అని భార్య శాలిని బేగం ఇచ్చినా కంప్లైంట్ మేరకు నేరెడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.