18-07-2025 01:15:07 AM
మల్కాజిగిరి, జులై 17 : నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయ కనగర్ డివిజన్, దీన్‌దయ నగర్‌లో నివసించే దాసా ని రఘోత్తం రెడ్డి ఫిర్యాదు మేరకు, ఆయన భార్య దాసాని సత్యలక్ష్మి (25), గృహిణి, భార్యాభర్తలు ఇద్దరికీ అప్పుడప్పుడు తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి అని వారం రోజుల క్రితం రాత్రి 11గంటలకు ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదని ఫోను కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలన్నారు పోలీసులు.