31-08-2024 02:23:01 PM
జడ్చర్ల వంద పడకల ఆసుపత్రి చుట్టూ చేరిన వర్షపు నీరు
జడ్చర్ల : మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి వర్షం భారీగా కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా కురోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతోపాటు కురుస్తున్న వర్షాలతో ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లాలో చెరువులకు చేరుకొని నీరు కొద్దికొద్దిగా చేరుకుంటుంది. సాయంత్రం వరకు యధావిధిగా వర్షం కురిస్తే అధిక మొత్తంలో చెరువులకు నీరు వచ్చే అవకాశం ఉంది. జడ్చర్ల ప్రాంతంలోని నిర్మించిన 100 పడకల ఆసుపత్రి చుట్టూ భారీ ఎత్తున వర్షం చేరుకుంది. దీంతో రోగులు ఆస్పత్రి బయటకి లోపలికి వచ్చే అవకాశం లేకుండా ఇబ్బందులు తల్లితడం జరిగింది. ఆస్పత్రి నిర్మాణం లోతట్టు ప్రాంతంలో నిర్మించడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని రోగులు జడ్చర్ల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు ఎలాగైనా బయటికి వెళ్లేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వర్షంలోనే అంబులెన్స్ తో ఆటలలో ఆసుపత్రికి రోగులు చేరుకుంటున్నారు.