రెండు రోజుల పాటు వర్షాలు
24-06-2024 01:12 AM
12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదివారం హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించామని, సోమవారం ఆయా జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల నెమ్మదించడంతో మొన్నటివరకు కొన్నిప్రాంతాల్లోనే వర్షం కురుస్తోందని స్పష్టం చేసింది. ఇప్పుడు రుతు పవనాల విస్తరణ వేగంగా ఉందని, అందుకే అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోందని చెప్పింది.






