తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు..!
26-06-2024 10:13 PM
హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గుజరాత్ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తం నుంచి మధ్య మహారాష్ట్ర,మారత్వాడ మీదుగా తూర్పు విదర్భ వరకు సగటున సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తులో విస్తరించి ఉన్నట్లు పేర్కొంది.దీని ప్రభావంతో ఆదిలాబాద్, కోమరంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీనంనగర్, జయంకర్, భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో వర్షాల పడినట్లు తెలిపింది.గురువారం నుంచి అన్ని జిల్లాల్లో గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.






