నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పాడనుందని జలమండలి అధికారులు తెలిపారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లు స్కీమ్ ఫేజ్ లోని కోదండాపూర్ పంప్‌హౌజ్‌లో రెండో పంపు ఎన్‌ఆర్‌వీ వాల్వ్ మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో రేపు కొన్ని చోట్లు పూర్తిగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా నీటి సరఫరాను నిలపి వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. యుద్ధప్రాతిపధికన మరమ్మతులు జరుగుతున్నట్లు చెప్పారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
ఎన్‌పీఏ, మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్‌పూర్, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్‌రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్, వైశాలినగర్, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురికాలనీ, మహేంద్రహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, మబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్‌పేట్, బడంగ్‌పేట్, శంషాబాద్ తదితర ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నది. కావున వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైంది.






