14 July, 2026 | 5:23 PM

అయోధ్య గర్భగుడిలోకి వర్షపు నీరు

26-06-2024 01:16 AM

ఇంజినీర్ల నిర్లక్ష్యమే కారణమన్న ప్రధాన అర్చకుడు

అయోధ్య, జూన్ 25 : ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య భవ్య రామమందిరానికి అప్పుడే పగుళ్లు ఏర్పడ్డాయి. తద్వారా, శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఆలయ పైకప్పు నుంచి వర్షపు నీరు గర్భగుడిలోకి ప్రవేశించాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. బాలరాముడిని పూజించేందుకు పూజారులు కూర్చునే చోట, దర్శనార్థం వీఐపీ భక్తులు వచ్చే మార్గంలోనూ వర్షపు నీరు లీక్ అవుతోందని, ఆలయ నిర్మాణంలో ఇంజినీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. వర్షపు నీరు బయటకు వెళ్లడానికి ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ గుడిలో లేదని తెలిపారు. దీన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆలయ కమిటీని కోరారు.