14 July, 2026 | 6:10 PM

కేజ్రీవాల్ మళ్లీ అరెస్టు

26-06-2024 01:14 AM

లిక్కర్ కేసులో సీబీఐ అరెస్టు

నేడు కోర్టులో హాజరు! 

ఈడీ కేసులో బెయిల్‌పై స్టే ఎత్తివేతకు హైకోర్టు నో  

న్యూఢిల్లీ, జూన్ 25: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈడీ కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న ఆయనను మంగళవారం విచారించి అరెస్టు చేసినట్టు ప్రకటించింది. బుధవారం ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నది. కాగా, ఈడీ కేసులో ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై స్టే విధించింది. ఈడీ సమర్పించిన వివరాలను సమగ్రంగా పరిశీలించడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని పేర్కొంది. బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచన చేయలేదని చెప్పింది.