20 August, 2026 | 7:00 AM

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారులకు శాపం

20-08-2026 12:00 AM

* పాఠశాల గేటు ముందు నిలిచిన వర్షపు నీరు

అలంపూర్, ఆగస్టు 19: మానవపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రధాన గేటు ముందు వర్షపు, మురుగునీరు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి, మురుగు నీటిని దాటుకుంటూ పాఠశాలలోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నీటిలో కాళ్లు జారి విద్యార్థులు గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయని తల్లిదండ్రులు తెలిపారు. దోమలు, ఈగలు ప్రబలడంతో చిన్నారుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మొరపెట్టుకున్నా స్పందన కరువు

ఇట్టి సమస్యను పలుమార్లు స్థానిక ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వాపోయారు.వెంటనే ఉన్నత అధికారులు డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, మురుగునీటిని తొలగించాలని వారు అధికారులను కోరుతున్నారు.