05-07-2025 12:00:00 AM
మణుగూరు, జులై 4 ( విజయ క్రాంతి) : వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా అవగాహనతో జాగ్రత్తలను పాటించాలని, మణుగూరు విద్యుత్ శాఖ ఏఈ బియ్యాని ఉమారావు అన్నారు. శు క్రవారం ఆయన విజయ క్రాంతితో ప్రత్యేకంగా మాట్లాడారు. వానా కాలలో జర పైలంమని,ప్రమాదాల నివారణకు అప్రమత్తతే రక్షన గా ఉంటుందని పేర్కొన్నారు.
వ్యవసాయ బావు ల వద్ద మోటార్లు, స్టార్టర్లను తడి చేతులతో తాకొద్దని, మోటార్లలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు సొంతంగా మరమ్మ తులు చేయకుండా సంబంధిత మెకానిక్ ను సంప్రదించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు ఎదురైనప్పుడు రైతులు, ప్రజలు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాల ని, మోటార్ల వద్ద స్టార్టర్లను చెక్క బాక్సులో ఎత్తుగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
రైతులు మోటార్లకు నేరుగా విద్యుత్ సరఫరా కాకుండా మధ్యలో ఫ్యూజ్ బాక్స్ ఏర్పాటు చేసుకోవాలని,వర్షాలకు తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దన్నారు. కూలినస్తంభాలల వద్ద విద్యుత్ సరఫరా అయితే వెంటనే వి ద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకున్న ఇనుప రేకులకు విద్యుత్ సరఫరా అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇనుప తీగలను దండాలుగా కట్టు కోవద్దని సూచించారు.
పశువులు వి ద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, తీగల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలుపాటించాలన్నారు.ప్రతి ఇంట్లో వైరింగ్ కోసం నాణ్యమైన ఉత్పత్తులనువినియోగించాలని,ముందస్తు జాగ్రత్తగా తప్పకుండా ఎర్తింగ్ చేసుకోవాలన్నారు. చేతులతో ప్లగ్లు, మోటార్లను ము ట్టుకోవద్దని, చార్జింగ్ పెట్టి సెల్ ఫోన్ లో మాట్లాడొద్దని కోరా రు.
విద్యుత్ షాక్ కు గురైన వ్యక్తిని ముట్టుకోకుండా, అతడిని విద్యుత్ తీగల నుంచి వేరు చేసేందుకు కర్ర, పాస్టిక్ వస్తువులతో ప్రయత్నించాలని,వ్యవసాయ క్షేత్రాల వద్ద నాణ్యత గల పంపుసెట్లనునియోగించాలన్నారు..ఇంట్లో, వ్యవసాయ పొలా ల వద్ద విద్యుత్ వైర్లు ఫెయిల్ అయిన వా టిని గుర్తించి నాణ్యమైన కొత్తవి వినియోగించి కొని విద్యుత్ సేవలను పొందాలని ఏ విజ్ఞప్తి చేశారు.విద్యుత్ సరఫరా, ప్రమాదాల సమయాల్లో టోల్ ఫ్రీ. నంబర్ 180042 50028, హెల్ప్ లైన్ 1912 సం బర్, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.