calender_icon.png 5 July, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగులో మెగా జాబ్ మేళలలో 150 నిరుద్యోగులకు ఉపాధి

04-07-2025 11:11:00 PM

బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకులు భూక్య జంపన్న అధ్యర్యంలో మెగా జాబ్ మేళా విజయవంతం

ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకులు భూక్య జంపన్న అధ్యర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేలాకు వివిధ గ్రామాల నుండి చాలామంది యువతీ,యువకులు మెగా జాబ్ మేళాకు రావడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాలోని ఫోస్కన్ ,ఆవిష్కరన్,ప్రీమియర్ ఎనరజిస్,రాధింటెంట్,కంపెనీలు  పాల్గొన్నారు ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ అయిన యువతీ,యువకులకు నేరుగా అపైట్మెట్ లెటర్ ఇప్పించి సుమారు 150మంది యువతీ యువకులకు ఉపాధి అందించారు.

ఈ సందర్భంలో భూక్య జంపన్న మాట్లాడుతూ ఈ సమాజంలో పేదరిక నిర్ములనకై తనవంతుగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని విద్య,వైద్యం, ఉపాధి తన అంతిమ లక్ష్యం అని అన్నారు యువతీ యువకులు తమ సొంత కాళ్ళ మీద తాము నిలబడి కుటుంబానికి అండగా ఉండాలని నేటి యువత దేశానికి ఆదర్శమని ఈ ప్రజలకు సేవ చేయడమే ఆ దేవుడు నాకిచ్చిన పెద్ద వరమని వాక్యానిచ్చారు ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుండి మరియు వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో యువతీ,యువకులు వచ్చారు ఇంతటి చక్కని అవకాశాన్ని కల్పించిన భూక్య జంపన్నకి యువతీ యువకులు ధన్యవాదములు తెలిపారు