10 July, 2026 | 12:28 PM

టీనేజ్ లవ్‌స్టోరీని బయటపెట్టిన రాజమౌళి

15-12-2024 12:00 AM

దర్శకుడు రాజమౌళి తాజాగా ఆయన తన ఇంటర్మీడియట్ ప్రేమకథను బయటపెట్టారు. రానా టాక్ షోలో పాల్గొన్న రాజ మౌళి తన టీనేజ్ లవ్ స్టోరీని వివరించా రు. తాజాగా ఈ షోకి సంబంధించి రాజమౌళితో మాట్లాడిన ఎపిసోడ్‌ను రిలీజ్ చే శారు. ఈ ఎపిసోడ్‌లోనే రాజమౌళి తన లవ్ స్టోరీని బయటపెట్టారు. “ఇంటర్ చదివేటప్పుడు భారతి అనే అమ్మాయి ఉండే ది. ఆమె అంటే నాకు ఇష్టం కానీ మాట్లాడాలంటే భయం. ఆ అమ్మాయంటే నాకు ఇష్టమని మా క్లాస్‌లో అబ్బాయిలంద రికీ తెలుసు.

వాళ్లంతా నన్ను ఆ విషయమై ఏడిపిస్తూ ఉండేవారు. ఏడాది మొత్తమ్మీద ఒకే ఒక్కసారి ఆమెతో మాట్లాడాను. చాలా కష్టం మీద ‘భారతి ట్యూషన్ ఫీజ్ కట్టావా?’ అని అడిగాను. ఆమె వెనక్కి తిరిగి చూసిన తీరు ఇప్పటికీ మరచిపోలేను. అయితే నేను భారతి అని పిలవగానే ఎంతో కాలంగా ఆ పిలుపు కో సం ఎదురుచూస్తున్నట్టుగా ఆమె చూసింది. ‘ట్యూషన్ ఫీజు కట్టావా?’ అని అడగ్గానే ఆమెలో ఇందుకా పిలిచింది అన్నట్టుగా నిరాశ కనిపించింది. తల ఊపి అటువైపు తిరిగింది. ఆ హావభావాలను ఇప్పటికీ మరువలేను. ‘ఈగ’లో ఇలాం టి సన్నివేశాలే నాని, సమంత మధ్య ఉంటాయి” అని రాజమౌళి తెలిపారు.