రామ్‌చరణ్‌ను చూస్తే షాకవుతారు
రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజ ర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ముఖ్య పాత్రను పోషించిన శ్రీకాం త్ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
గేమ్ చేంజర్‌లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
శంకర్ గారితో పని చే యాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు ఉంటుంది. గేమ్ చేంజర్ కథ ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకెం దుకు చెబుతున్నారా? అనుకున్నాను. సెకండాఫ్ చెప్పిన త రువాత ఈ పాత్రను నేనే చేయాలని అనుకున్నాను. నా కారెక్టర్, గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ ప్రోస్థటిక్ మేకప్‌కే నా లుగు గంటలు పట్టేది.
శంకర్‌తో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
శంకర్ గారి పనితనం గురించికొత్తగా చెప్పాల్సిన పని లేదు. చాలా సహనంతో ఉంటారు. అనుకు న్నది అనుకున్నట్టు వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటా రు.
గేమ్ చేంజర్‌లో మీ పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో ఉంటుందా? పాజిటివ్‌గా ఉంటుందా?
నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్, సస్పెన్స్‌లు ఉంటాయి. అవన్నీ చెప్పొద్దన్నారు. గెటప్ వేసిన వెంటనే ఆ కారెక్టర్ తాలుకా షేడ్స్ అన్నీ వచ్చేస్తాయి.
ఎవరితో ఎక్కువ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి?
ఎస్‌జే సూర్య, జయరాం, సముద్రఖని, రామ్ చరణ్ ఇలా అందరితోనూ సీన్లు ఉంటాయి. సూర్య పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సరిపోదా శనివారం పాత్రను మించేలా ఉంటుంది.
గెటప్ చాలా కొత్తగా ఉంది.. ఈ లుక్‌నెలా ఫైనల్ చేశారు?
మా తండ్రి గారి గెటప్‌ను చూసే నాకు ఈ క్యారెక్టర్ లుక్‌ను ఫిక్స్ చేశారు. గెటప్ వేసుకుని నేరుగా ఇంటికి వెళ్లాను. మా అమ్మ చూసి షాక్ అయ్యారు. హేయ్ బేబీ (నవ్వుతూ) అని సరదాగా పిలిచాను. అప్పుడు నా గెటప్ సరిగ్గా సెట్ అయిందని అనుకున్నాను.
గేమ్ చేంజర్ చిత్రం ఎలా ఉండబోతోంది?
ప్రస్తుతం ఎలివేషన్స్‌తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మ ధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అస్సలు కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి.
రాబోవు చిత్రాలు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటోం ది. ‘సంబరాల ఏటు గట్టు’లో నటిస్తున్నాను. కళ్యాణ్ రామ్ మూవీ లో నటిస్తున్నాను. అలాగే ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను.
మీ కొడుకు చిత్రాల గురించి చెప్పండి?
నా కొడుకు రోషణ్ ప్రస్తుతం ఛాంపియన్ చిత్రాన్ని చేస్తున్నా డు. మేమిద్దరం ఇప్పట్లో అయితే కలిసి నటించం.






