17 April, 2026 | 12:09 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

రాజాసాబ్ వచ్చేది అప్పుడే

04-06-2025 01:27 AM

ప్రభాస్, డైరెక్టర్ మారుతి, పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందు తున్న క్రేజీ మూవీ ‘రాజాసాబ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల ద్వారా విడుదల చేయనున్నట్టు మేకర్స్ మంగళవారం ప్రకటించారు. ఈ నెల 16న ఈ మూవీ టీజర్‌ను సైతం రిలీజ్ చేయనున్నారు.

ఒకేసారి రెండు అప్‌డేట్స్ గురించి మూవీ టీమ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడంతో అటు ప్రభాస్ ఫ్యా న్స్, ఇటు సినీప్రియుల ఆనందాన్ని అవధుల్లేకుండాపోయింది. రిలీజ్‌డేట్ అనౌన్స్‌మెం ట్ పోస్టర్‌లో డబ్బులతో నిండి ఉన్న గదిలో ప్రభాస్ ఫెరోషియస్‌గా కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువ లతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.

ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై  భారీ అంచనాలేర్పడ్డాయి. హీరోయి న్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ తదితరులు వివిధ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని; సంగీ తం: తమన్; ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, కింగ్ సోలొమన్; ఎడిటర్: కోటగిరి వేంకటేశ్వరరావు.