calender_icon.png 5 June, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చౌదరిగారి అబ్బాయి.. నాయుడుగారి అమ్మాయి!

04-06-2025 01:29:22 AM

బిగ్‌బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి, నటి సురేఖవాణి కూతురు సుప్రీత నాయుడు హీరోహీరోయిన్‌గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మాల్యాద్రిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్ సౌజన్యంతో ఎమ్3 మీడియా పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి ‘చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి గ్లింప్స్‌ను తాజాగా పాత్రికేయుల సమక్షంలో చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అమరదీప్ చౌదరి మాట్లాడుతూ.. “నా మొదటి సినిమాకు ఇంత మంచి టైటిల్‌లో వస్తున్నందుకు సంతోషంగా ఉంది” అని చెప్పారు. హీరోయిన్ సుప్రీత మాట్లాడుతూ.. “సినిమా ప్రారంభ సమయంలో నాకు భయం వేసింది. కానీ ఇప్పుడు నమ్మం వచ్చింది.

డైరెక్టర్, హీరో షూటింగ్ టైమ్‌లో చాలా సపోర్ట్ చేశారు. నిర్మాత ఇంటి అమ్మాయిలా చూసుకున్నారు” అన్నారు. నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ.. “ఈ సినిమాను మేము లిమిటెడ్ బడ్జెట్‌తో ప్రారంభించాం. కానీ మా హీరోహీరోయిన్‌కు ఉన్న పాపు లారిటీ వల్ల మా చిత్రానికి క్రేజ్ పెరిగింది.

అందరికి సుపరిచితులైన నటీనటులు రాశి, వినోద్‌కుమార్, సురేఖవాణి, రాజా రవీంద్ర ఇందులో భాగమయ్యారు. షూటింగ్ అంతా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాం” అని తెలిపారు. నటి సురేఖ వాణి, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.