25 May, 2026 | 1:45 AM

ప్లే ఆఫ్స్‌కు రాజస్థాన్

25-05-2026 01:00 AM

పంజాబ్, కోల్‌కతా ఔట్

చేజేతులా ఓడిన ముంబై

ఆర్చర్ఆ ల్‌రౌండ్ షో

ఐపీఎల్ 19వ సీజన్ చివరి బెర్తుపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ముంబై ఇండియన్స్‌ను ఓడించి 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఆద్యం తం అనూహ్య మలుపులు తిరుగుతూ సాగింది. ఒక దశలో ముంబై గెలిచేలా కనిపించినా డెత్ ఓవర్లలో రాయల్స్ అద్భుతంగా పుంజు కుని గెలిచింది. ఫలితంగా చేజేతులా ఓడిన ముంబై తనతో పాటు పంజాబ్, కోల్‌కతాను కూడా ఇంటికి పంపించింది. ఆర్చర్ (3/17), బ్రిజేశ్ శర్మ (2/26) రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించారు.

ముంబై, మే 24 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావ డంతో రాజస్థాన్ బ్యాటర్లు కాస్త ఒత్తిడిలో కనిపించా రు. దానికి తగ్గ ట్టే ఆరంభంలో వరుసగా వికెట్లు సమర్పించుకు న్నారు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది.

అంచనాలు పెట్టుకున్న జైస్వాల్ (27), వైభవ్ సూర్యవంశీ (2) నిరాశ పరిచారు. రియాన్ పరాగ్(14) సైతం మరోసారి ఫెయిలయ్యాడు. ఈ దశలో ధృవ్ జురెల్, దసున్ శనక ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. శన క 15 బంతుల్లో 29 (3 సిక్సర్లు) ధాటిగా ఆడే క్రమంలో ఔటవగా.. జురెల్ 26 బం తుల్లో 38 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ కు వెనుదిరిగాడు.

ఇక్కడ నుంచి రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయినా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. ఫెరీరా 18 పరుగుల చేయగా.. ఆ ర్చర్ మెరుపులు మెరిపించాడు. 15 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా(18) నాటౌట్ , బర్గర్ (10) నాటౌట్‌గా నిలవడంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో దీపక్ చా హర్ 2, శార్థూల్ ఠాకూర్ 2 వికెట్లు తీసారు. ఛేజింగ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలో భారీ షాక్ తగి లింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌటయ్యాడు.

కాసేపటికే రికెల్టన్ (12), నమన్ ధీర్ (6), తిలక్ వర్మ (3) ఔటవడంతో ముంబై 38 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. భారీ లక్ష్యఛేదనలో పవర్ ప్లేలోనే 4 కీలక వికెట్లు చేజా ర్చుకోవడంతో ముంబై ఓటమి ఖాయమనుకున్నారు. ఈ దశలో ఫామ్‌లో లేని సూర్యకు మార్ యాదవ్, విల్ జాక్స్ కీలక భాగస్వా మ్యం నెలకొల్పారు. వీరిద్దరూ 63 పరుగులు జోడించారు. విల్ జాక్స్ 33 (18 బం తుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటైన తర్వాత హార్థిక్ పాండ్యాతో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అటు క్రీజులోకి వస్తూనే పాండ్యా కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ 48 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పడంతో ముంబై గెలుపు ఖాయమనిపించింది. అయితే అనూహ్యంగా డెత్ ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వరుసగా పాం డ్యా ( 15 బంతుల్లో 34 )తో పాటు సూర్యకుమార్, కార్బిన్ బోస్చ్‌లను ఔట్ చేశారు. ఇక్కడ నుంచి ముంబై కోలుకోలేకపోయిం ది. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులే చేయగలిగింది. ముంబై ఓటమితో పంజాబ్, కోల్‌కతా కూడా నిష్క్రమించాయి.

స్కోరు బోర్డు

రాజస్థాన్ ఇన్నింగ్స్ : 205/8 (జురెల్ 38, ఆర్చర్ 32, శనక 29, దీపక్ చహర్ 2/43, శార్థూల్ ఠాకూర్ 2/41)

ముంబై ఇన్నింగ్స్ :  175/9 (సూర్యకుమార్ 60, హార్థిక్ 34, విల్ జాక్స్ 33, ఆర్చర్ 3/17, బర్గర్ 2/43, బ్రిజేశ్ శర్మ 2/26)