12 August, 2026 | 1:18 AM

రాజేష్‌కుమార్‌కు కీలక పదవి

12-08-2026 12:00 AM

బీజేపీ బిజినెస్ సెల్ కన్వీనర్‌గా నియామకం

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): గోల్కొండ జిల్లా బీజేపీ బిజినెస్ సెల్ కన్వీనర్‌గా రాజేష్‌కుమార్ కర్వా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వ్యాపారుల సెల్ రాష్ట్ర కో- ఆర్డినేటర్ విపాల శారద గోల్కొండ జిల్లా బిజినెస్ సెల్ కన్వీనర్‌గా రాజేష్‌కుమార్ కర్వాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సమాజ హితం కోసం పాటు పడుతున్న రాజేష్ కుమార్ సేవలను గుర్తించి, గోల్కొండ జిల్లా బిజినెస్ సెల్ కన్వీనర్‌గా నియమించినట్లు పేర్కొన్నారు. రాజేష్‌కుమార్ మాట్లాడుతూ.. తన సేవలకు గుర్తింపుగా గోల్కొండ జిల్లా బిజినెస్ సెల్ కన్వీనర్ పదవీ బాధ్యతలు అప్పగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల సహకారంతో తనకు అప్పగిం చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు.