పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
- డ్రగ్స్, చట్టవ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లొద్దు
- మంథని జేఎన్టీయూ కాలేజీలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్
రామగిరి, ఆగస్టు 11 (విజయ క్రాంతి): పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరిస్తూ వారి ప్రవర్తన, స్నేహాలు, కార్యకలాపాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాల ని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ సూచించారు. పిల్లలు చేసే తప్పులను సమర్థించకుండా, చిన్న వయస్సులోనే వారికి మంచి చెడులపై అవగాహన కల్పించాలన్నారు. మంథని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థుల కోసం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ బి. విష్ణువర్ధన్ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోదావరిఖని ఏసీపీ మడత రమే ష్తో పాటు సింగరేణి సంస్థ ఆర్జీ-3 జీఎం మ ధుసూదన్, అడ్రియాల ప్రాజెక్టు జీఎం కొలిపాక నాగేశ్వరరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థులపై తల్లిదండ్రులు నిత్యం కన్నేసి ఉంచాలని, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని అన్నారు.
విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని, అనవసర వ్యవహారాల్లో తలదూర్చి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ముఖ్యంగా డ్రగ్స్ వంటి మత్తు పదా ర్థాల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగా లని సూచించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు.
విద్యార్థుల తప్పిదాల కార ణంగా తల్లిదండ్రులు చట్టం ముందు దోషులుగా నిలబడే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్క రూ బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.మంథని జేఎన్టీయూ కళాశాలకు మంచి పేరు ఉందని, ఆ పేరును నిలబెట్టేలా విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని ఏసీపీ కోరారు.
కళాశాల పరిసరాలపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుందని, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎం. ఉదయ్కుమార్ పవర్ ప్రజెంటేషన్ ద్వారా హాజరు, క్రెడిట్లు, పరీక్షలు, సబ్జెక్టులు తదితర అంశాలపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమం అనంతరం కళాశాల యాజమాన్యం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు.






