calender_icon.png 11 February, 2026 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజేష్ లాకప్ డెత్‌పై చట్టం తేవాలి

11-02-2026 03:04:01 AM

ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జీ సోమన్న 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఫిబ్రవరి 10: ఈనెల 16న మండల కేంద్రం అర్వపల్లిలో జరగబోయే కర్ల రాజేష్ సంతాప సభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న పిలుపునిచ్చారు. మంగళ వారం మండల కేంద్రం అర్వపల్లిలో జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 నవంబర్16న కోదాడలో లాకప్ డెత్ కి గురైన కర్ల రాజేష్ మృతిపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇందుకోసం ఈనెల16న సాయంత్రం 5గంటలకు జరగబోయే రాజేష్ సంతాప సభకి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు,పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ హాజరు కానున్నట్లు చెప్పారు.రాజేష్ లాకప్ డెత్ కు కారకులైన చిలుకూరు ఎస్త్స్ర సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

అంతేగాక ఈ ఘటనలో సంబంధం ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పూలే,అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపకులు ఈదురు వీరపాపయ్య,వీహెచ్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు గడ్డం ఖాసీం,జిల్లా కార్యదర్శి పాల్వాయి పరశురాం,కొండగడుపుల శ్రీను,మండల అధ్యక్షులు కుంకుడుపాల రవి,కార్యదర్శి మచ్చ నర్సయ్య,నాయకులు ఊటుకూరి రవీందర్,విష్ణు,చెరుకు శైలేందర్,గుండె ఈశ్వర్,సూరారపు సైదులు, వెంకన్న,శ్రీను తదితరులు పాల్గొన్నారు.