calender_icon.png 11 February, 2026 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నాయకుడికి కన్నీటి వీడ్కోలు

11-02-2026 03:02:11 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఫిబ్రవరి10: తెలంగాణ ఉద్యమ నేత,బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు,మాజీ సర్పంచ్ మన్నె లక్ష్మీనర్సయ్య యాదవ్ మృతితో జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తి గ్రామంలో విషాదం నెలకొంది.అనారోగ్యంతో కన్నుమూసిన లక్ష్మీనర్సయ్య యాదవ్ మృతికి పార్టీ శ్రేణులు,అభిమానులు పెద్ద ఎత్తున మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు.ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.

కళాకారుల ఆటపాటలతో ఉద్యమనేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి,మాజీ రాజ్యసభ సభ్యుడు,బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్,తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్,బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్,సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,కొలిశెట్టి యాదగిరి రావు,నుడెమోక్రసీ జిల్లా నాయకులు బొడ్డు శంకర్,పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు పి.కిరణ్,వివిధ గ్రామాల సర్పంచులు గుంటకండ్ల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.