రజనీకాంత్ బయోపిక్

02-05-2024 12:05:00 AM

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో బిజీగా వున్నారు. బస్ కండక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించి సూపర్‌స్టార్‌గా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. కేవలం సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడు. ఆయన సినిమా కెరీర్ కూడా ఎంతో ఆసక్తికరంగా, నలుగురికి ఆదర్శప్రాయంగా వుంటుంది. ఇప్పుడు ఆయన జీవితాన్ని సినిమాగా తీసుకురానున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాని 2025లో చిత్రీకరణ ప్రారంభిస్తారని తెలిసింది. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్ పాత్రలో తమిళ స్టార్ హీరో ధనుష్ నటించే అవకాశం వుందని సమాచారం. ఇటీవల సాజిద్, రజనీకాంత్‌లు కలిసి వున్న ఓ ఫోటోను సాజిద్ సోషల్‌మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. ‘లెజండరీ సినిమా కోసం పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా లైఫ్‌లో మరిచిపోలేని జర్నీని ప్రారంభించడానికి సిద్దమవుతున్నాం. వేచి ఉండండి’ అని పోస్ట్ చేశారు. దీంతో అది రజనీకాంత్ బయోపిక్ అని అందరూ గెస్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ లైఫ్‌లోని ఎత్తు పల్లాలు, కష్టనష్టాలు అన్ని వుంటాయని అంటున్నారు.