20 August, 2026 | 8:45 PM

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

20-08-2026 08:11 PM

బేల,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాంఖడే రూపరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సాంకేతిక రంగంలో రాజీవ్ గాంధీ చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించారు.